Coronavirus: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Night Curfew In Maharashtra From Sunday
x

Coronavirus: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Highlights

Coronavirus: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 28 నుంచి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధించింది.

Coronavirus: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 28 నుంచి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధించింది. వైరస్‌ కట్టడికి ఈ నిర్ణయం తీసుకునట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు కరోనా నిబంధనలు పాటించాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రిపూట కర్ఫ్యూకి సంబంధించిన ఉత్తర్వులను విపత్తు నిర్వహణ శాఖ త్వరలోనే విడుదల చేస్తుందని సీఎం కార్యాలయం వెల్లడించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు మాల్స్‌ మూసివేయాలని ఆదేశించింది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 35,952 కొత్త కేసులు, 111 మరణాలు వెలుగుచూశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories