NIA: ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర కేసులో NIA కోర్టు కీలక తీర్పు..

NIA Court Key Judgment In Indian Mujahideen Conspiracy Case
x

NIA: ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర కేసులో NIA కోర్టు కీలక తీర్పు..

Highlights

NIA: వారణాసి, ముంబై, ఫిజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలో కీలక పాత్ర

NIA: ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర కేసులో NIA ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. నలుగురు ఉగ్రవాదులకు 10 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. ఒబేద్ అన్సారీ, ఇమ్రాన్ ఖాన్, ధనీష్ అన్సారీ, ఆఫ్తాబ్ అలంకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ జంటపేలుళ్లుతో పాటు వారణాసి, ముంబై , ఫిజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలో ఈ నలుగురు ఉగ్రవాదులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

భారత్‌లో బాంబు పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ పన్నిన కుట్రను అమలు చేయడంలో ఈ నలుగురు నిందితులు కీలక భూమిక పోషించినట్లు కోర్టు నిర్ధారించింది. పాక్‌కు చెందిన రియాజ్ భత్కల్ యాసిన్ భత్కల్‌తో పాటు పలువురు ఉగ్రవాదులు ఢిల్లీ సహా భారత్‌లోని కీలక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించినట్లు NIA దర్యాప్తులో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories