Corona: 18 రాష్ట్రాల్లో కరోనా కొత్త రకాలు

New Types of Corona in 18 States
x

కరోనా:( ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: దిల్లీ, మహారాష్ట్రల్లో డబుల్‌ మ్యూటెంట్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ తాజాగా వెలుగు చూసింది.

Corona: దేశంలో కోవిడ్ కేసుల్లో 18 రకాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా కేసుల పెరుగుతున్న క్రమంలో వైరస్‌ మార్పులు ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. దిల్లీ, మహారాష్ట్రల్లో రెండుసార్లు ఉత్పరివర్తనం చెందిన (డబుల్‌ మ్యూటెంట్‌ వేరియంట్‌) కరోనా వైరస్‌ తాజాగా వెలుగు చూసింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. బ్రిటన్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల్లో కలకలం సృష్టించిన వైరస్‌లు... మన దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాపిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటానికి ఈ వైరస్‌లే కారణమా? కాదా? అన్నది కచ్చితంగా చెప్పలేమంది. అయితే- వీటి జన్యుక్రమం, ఉత్పరివర్తనాలు, వ్యాప్తిపై 'ఇండియన్‌ సార్స్‌ కొవ్‌-2 కన్సార్టియం ఆన్‌ జీనోమిక్స్‌ (ఇన్సాకాగ్‌)' అధ్యయనం సాగిస్తున్నట్టు తెలిపింది.

''విదేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి, వారి ద్వారా మహమ్మారి సోకినవారికి ఇన్సాకాగ్‌ పరీక్షలు చేసింది. మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 10,787 నమూనాలను సేకరించి వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించింది. వీటిలోని 771 కేసుల్లో వైరస్‌ మార్పులు వైవిధ్యంగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా 736 కేసులకు బ్రిటన్‌ వైరస్‌; 34 కేసులకు దక్షిణాఫ్రికా రకం; ఒక్క కేసుకు బ్రెజిల్‌ వైరస్‌ కారణమని నిర్ధారణ అయింది. రెండుసార్లు మార్పులకు లోనైన ఆందోళనకర కరోనా వైరస్‌ (వీవోసీ) దిల్లీ, మహారాష్ట్రల్లో వెలుగు చూడటం గమనార్హం. గత ఏడాది డిసెంబరుతో పోల్చితే... 'ఈ484క్యూ', 'ఎల్‌452ఆర్‌' ఉత్పరివర్తనాల వేగం పెరిగింది. ఈ మార్పులకు లోనైన వైరస్‌లు రోగనిరోధక వ్యవస్థకు చిక్కకుండా, మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నాయి. మొత్తం నమూనాల్లో ఇలాంటివి 15-20% వరకూ ఉంటాయని ఆరోగ్యశాఖ అంచనా వేసింది.

కేరళలోని 14 జిల్లాల నుంచి సేకరించిన 2,032 నమూనాల జన్యుక్రమాన్ని ఇన్సాకాగ్‌ విశ్లేషించగా... 123 శాంపిళ్లలో 'ఎన్‌440కె' రకం వైరస్‌ కనిపించింది. రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం దీని ప్రత్యేకత. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ నుంచి సేకరించిన నమూనాల్లో 33%; తెలంగాణ నుంచి సేకరించిన వాటిల్లో సుమారు 50% ఈ రకమే కనిపించింది. అత్యధిక కేసులు 10 జిల్లాల్లో నమోదయ్యాయి. ఈ 10 జిల్లాల్లో తొమ్మిది మహారాష్ట్ర జిల్లాలు ఉండగా, కర్ణాటకకు చెందిన ఒక జిల్లా ఉంది. టాప్ 10 జిల్లాల్లో పూణె అగ్రస్థానంలో ఉంది. మరోవైపు మహారాష్ట్ర, పంజాబ్ లతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories