భారత్‌లో కొత్త రకం కరోనా అలజడి

భారత్‌లో కొత్త రకం కరోనా అలజడి
x
Highlights

* కొత్త రకం కరోనా వేరియంట్‌ను గుర్తించిన.. * ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ శాస్త్రవేత్తలు * కొత్త వైరస్‌కు ఎన్‌ 440కెగా నామకరణం

ఓవైపు యూకేలో వెలుగుచూసిన కొత్త కరోనా స్ట్రెయిన్‌తో ప్రపంచం వణికిపోతున్న వేళ.. భారత్‌లో మరో రకం వైరస్‌ బయటపడటం కలవరపెడుతోంది. కొత్తగా మరో రకం వైరస్‌ను గుర్తించినట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్‌కు ఎన్‌440కెగా నామకరణం చేశారు. ఈ కొత్త రకానికి కరోనా యాంటీ బాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణమున్నట్లు వెల్లడించారు.

ఇక ఈ వైరస్‌ గురించి కీలక విషయాలు వెల్లడించింది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ. కొత్తగా గుర్తించిన ఈ వైరస్‌ ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నట్లు నిర్ధారించారు శాస్త్రవేత్తలు. దేశ వ్యాప్తంగా 6 వేల 370 జీనోమ్ విశ్లేషణలు జరపగా.. అందులో 2 శాతం ఎన్440కే రకం మ్యుటేషన్ గుర్తించారు. ఈ రకం వైరస్‌ జులై-ఆగస్టు నెలల్లో ఆసియాలో ఎన్440కే రకం కరోనా వైరస్ ఆవిర్భవించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 133 దేశాల్లో 2,40,000 జీనోమ్స్ విశ్లేషణలో 126 రకాల మ్యుటేషన్లకు కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉండగా.. మన దేశంలో 19 రకాలు ఉన్నట్టు తేల్చారు.

ఇక యూకేలో గుర్తించిన కొత్త రకం కరోనా కలవరపెడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లపై ఎప్పటిలాగే నిఘా కొనసాగుతుందని తెలిపింది. యూకేలో కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు హోం శాఖ సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories