Ration Card: మీకు రేషన్ కార్డు ఉందా... కేంద్రం చేసిన మార్పుల గురించి తెలుసుకున్నారా..?

New Rules has Come in Free Ration Scheme Full Details Here
x

Ration Card: మీకు రేషన్ కార్డు ఉందా... కేంద్రం చేసిన మార్పుల గురించి తెలుసుకున్నారా..?

Highlights

Ration Card: భారత ప్రభుత్వం నిరుపేదల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. పెడుతూనే ఉంది. ఈ పథకాల కారణంగా ఎంతో మంది పేదల కష్టాలు తీరుతున్నాయి.

Ration Card: భారత ప్రభుత్వం నిరుపేదల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. పెడుతూనే ఉంది. ఈ పథకాల కారణంగా ఎంతో మంది పేదల కష్టాలు తీరుతున్నాయి. వీటి కారణంగా ఎంతో మంది పేద ప్రజల కష్టాలు తీరుతున్నాయి. పేద ప్రజలకు అండదండలుగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా దేశంలోని పేద ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలు లాంటి ఆహార పదార్థాలు అందజేస్తుంది ప్రభుత్వం. దాదాపు 80 కోట్ల మంది ప్రజలు ఈ పథకం ప్రయోజనం అందుకుంటున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) పరిధిలోకి వచ్చే రేషన్ కార్డు ఉన్నవారు ఈ స్కీమ్‌కు అర్హులు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని కీలక మార్పులను తీసుకొచ్చింది.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా అందే బియ్యం, గోధుమల పంపిణీలో మార్పులు చేశారు. 2024 నవంబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు ప్రతి నెలా ఒక్కొక్కరికి మూడు కిలోల బియ్యం, రెండు కిలోల గోధుమలు ఇస్తుండేది ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రతి నెలా ఒక్కొక్కరికి 2.5 కిలోల బియ్యం, 2.5 కిలోల గోధుమలు పంపిణీ చేస్తుంది.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో మరో ముఖ్యమైన మార్పు తీసుకొచ్చారు. తాజాగా "వన్ నేషన్, వన్ రేషన్ కార్డు" అనే ఒక కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫలితంగా లబ్ధిదారులు తమ రేషన్ కార్డులతో నచ్చిన చోట ఈ పథకం కింద ఆహార ధాన్యాలను అందుకోవచ్చు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ నగరానికి వెళ్లినా, తమ రేషన్ కార్డును ఉపయోగించుకుని ప్రస్తుతం తాము నివసించే ప్రాంతంలో రేషన్ పొందవచ్చు. ఇంతకుముందు వేరే రాష్ట్రానికి వెళితే అక్కడ కొత్త రేషన్ కార్డు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది . కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. ఈ స్కీమ్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైంది. త్వరలోనే మొత్తం దేశానికి విస్తరించనుంది.

వాస్తవానికి కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో చాలా మంది పేద ప్రజలు వలస వచ్చిన రాష్ట్రంలో ఆహారం, ఉపాధి లభించక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన" పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. ఈ పథకాన్ని మొదట 2020 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు అలాగే కొనసాగిస్తుంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా అంత్యోదయ అన్న యోజన, ప్రయారిటీ హౌస్‌హోల్డ్స్ కింద వచ్చే కుటుంబాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోజువారీ కూలీలు వంటి వారు ప్రయోజనాలు అందుకుంటారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డుతో దగ్గరలో ఉన్న "ఫెయిర్ ప్రైస్ షాప్" వెళ్లాలి. అక్కడ వేలిముద్ర లేదా IRIS చూపించి ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి. రేషన్ కార్డులో పేరు ఉన్న వారు రేషన్ తీసుకోవచ్చు. లిస్టులో ఉన్నవారు ఫ్రీ రేషన్ తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories