New PF Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్?

New PF Tax Rules From April 1st
x

ఈపీఎఫ్‌‌వో (ఫైల్ ఫోటో )

Highlights

New PF Tax Rules: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం షాకిచ్చేందుకు రెఢీ అయ్యింది.

New PF Tax Rules: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం షాకిచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటివరకు ఈపీఎఫ్ నుంచి పొందిన వడ్డీకి టాక్స్ మినహాయింపు ఉన్న విషయం ఖాతాదారులకు తెలిసిందే. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు మారనున్నాయి. ఈపీఎఫ్ లో ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసే ఖాతాదారులకు అందించే వడ్డీపై పన్నులను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రకటించారు.

అంటే ఏడాదికి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ .2.5 లక్షలకు మించితే.. అందుకు పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నది సారాంశం. అయితే కేవలం ఉద్యోగులు జమ చేసే మొత్తంపైనే ఈ పన్నును లెక్కించనున్నారు. 1, ఏప్రిల్ 2021 నుంచి ఇది అమలులోకి వస్తుంది. పీఎఫ్‌లో ఉద్యోగి వాట ఏడాదికి రూ.2.5 లక్షల లోపు ఉంటే 80సీ కింద ఎప్పటిలానే మినహాయింపు ఉంటుంది.

పీఎఫ్‌లో ఉద్యోగితో పాటు తను పని చేస్తున్న సంస్థ కూడా ఉద్యోగి తరఫున కొంత జమ చేస్తుంది. అయితే ఈ మొత్తానికి కొత్త నిబంధనలు వర్తించవు. కేవలం ఉద్యోగి వాటాపై మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. ఉద్యోగుల ఆదాయపు పన్ను ట్యాక్స్ శ్లాబ్ ప్రకారం ఈ ట్యాక్స్ ను లెక్కిస్తారు. ఉద్యోగి ఎంత శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తే అంత శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగి 20 శాతం ట్యాక్స్ శ్లాబ్‌ పరిధిలోకి వస్తే అతను 20 శాతాన్ని పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంపై త్వరలోనే ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories