New Education Policy 2020: మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ పేరు మార్పుకు కేబినెట్ ఆమోదం

New Education Policy 2020: మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ పేరు మార్పుకు కేబినెట్ ఆమోదం
x
Highlights

New Education Policy 2020: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్‌ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం...

New Education Policy 2020: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్‌ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. ఇస్రో మాజీ చీఫ్‌ కే కస్తూరిరంగన్‌ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది.

నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్‌ఆర్డీ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని ఈ కమిటీ సూచించింది. 1985 సెప్టెంబరులో విద్యాశాఖను మానవ వనరుల శాఖగా మారుస్తూ నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories