పాకిస్థాన్‌ సరిహద్దులో కొత్త ఎయిర్‌బేస్‌.. గాంధీనగర్‌లో శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

New Airbase Coming up in Gujarat Near India-Pakistan Border
x

పాకిస్థాన్‌ సరిహద్దులో కొత్త ఎయిర్‌బేస్‌.. గాంధీనగర్‌లో శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

Highlights

Narendra Modi: దేశ భద్రతకు కొత్త ఎయిర్‌బేస్‌ అత్యంత కీలకంగా మారుతుందన్న పీఎం

PM Narendra Modi: గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న డిఫెన్స్‌ ఎక్స్‌పో-2022ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే గుజరాత్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దులో కొత్తగా నిర్మించనున్న ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. పాకిస్థాన్‌ చొరబాట్లు, దాడుల నేపథ్యంలో దేశ భద్రతకు ఈ కొత్త ఎయిర్‌బేస్‌ అత్యంత కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు. ఈ ఎయిర్‌బేస్‌ను ఉత్తర గుజరాత్‌లోని బనతస్కంతలోని దీస ప్రాంతంలో నిర్మించనున్నట్టు తెలిపారు.

తాజాగా డిఫెన్స్‌ ఎక్స్‌లో తొలిసారి కేవలం దేశీయ కంపెనీలే పాల్గొన్నట్టు తెలిపారు. మొత్తం 411 రక్షణ రంగానికి చెందిన ఆయుధాలను, పరికరాలను ఎక్స్‌పోలో ప్రదర్శించినట్టు ప్రధాని వెల్లడించారు. ఈ ఎక్స్‌పోతో భారత రక్షణ రంగానికి కొత్త ఊపు వస్తుందని ప్రధాని తెలిపారు. అంతేకాకుండా.. భారత ఆయుధాలను విదేశాలకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. గత కొన్నేళ్లలో ఆయుధాల విక్రయం 8 రెట్లకు పెరిగిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. డిఫెన్స్‌ ఎక్స్‌పోలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories