నేతాజీ కాదా..? ఆయన ఎవరు? వివాదాస్పదమైన రాష్ట్రపతి ఆవిష్కరించిన చిత్రపటం

Ram Nath Kovind
x

 Ram Nath Kovind

Highlights

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని కేంద్రం ఘనంగా నిర్వహించింది. నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేతాజీ జయంతిని...

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని కేంద్రం ఘనంగా నిర్వహించింది. నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటాన్ని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించిన ఫోటో వివాదాస్పదమవుతోంది. ఆ ఫోటో వుంది నేతాజీ కాదని, ఆయన బయోపిక్‌లో చంద్రబోస్ క్యారెక్టర్ చేసిన నటుడదని సామాజీక మాద్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రపతి ఆవిష్కరించిన చిత్రపటంలోని ఫోటో నేతాజీది కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా 2019లో తెరకెక్కిన 'గుమ్నమీ' సినిమాలో నేతాజీ పాత్ర పోషించిన ప్రసేన్‌జిత్ ఛటర్జీది' అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు నేతాజీ ఫోటోపై సాగుతున్న ప్రచారాన్నిభారతీయజనతా పార్టీ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆ ఫోటోను నేతాజీ కుటుంబం అందజేసిందని, పద్మశ్రీ గ్రహీత ప్రముఖ చిత్రకారుడు పరేశ్ మైటీ ఈ చిత్రపటాన్ని వేశారని అంటోంది. ప్రసేన్‌జిత్‌‌ పోలికే లేదని, ఇది అనవసరమైన వివాదమని మండిపడుతోంది. అయితే ఈ ఫోటోను నేతాజీ కుటుంబ సభ్యుల్లో ఎవరు అందించారనేది స్ఫష్టత లేదు.




Show Full Article
Print Article
Next Story
More Stories