NEST Exam:ఏడాదికి 80 వేల స్కాలర్‌షిప్‌.. ఇంటర్ స్టూడెంట్లకు భలే ఛాన్స్

Nest Exam 2021 Notification Released
x

నెస్ట్ ఎగ్జామ్ (ఫోటో హన్స్ ఇండియా )

Highlights

సైన్స్ లో రాణించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అనుకునే వారకి గుడ్ న్యూస్. NEST 2021 నోటిఫికేషన్ విడుదలైంది.

Nest Exam 2021: సైన్స్ లో రాణించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అనుకునే వారకి గుడ్ న్యూస్. నేషనల్ ఎంట్రన్ప్ స్కీనింగ్ టెస్ట్ (NEST) 2021 నోటిఫికేషన్ విడుదలైంది. సైన్స్ లో రీసెర్చ్ నే కెరీర్ గా ఎంచుకునే వారికి Nest అనేది బెటర్ ఛాయిస్. జాతీయ స్థాయిలో నిర్వహించే నెస్ట్ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (Integrated Msc) ఐదేళ్ల కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు.

ఈ పరీక్ష ద్వారా 2021-26 విద్యాసంవత్సరంలో బయాలజీ(Biology), మ్యాథ్స్‌(Maths), ఫిజిక్స్(Physics)‌, కెమిస్ట్రీ(Chemistry) సబ్జెక్టుల్లో పీజీ కోర్సు- ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు..

ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల నుంచి 2019, 2020 సంవత్సరాల్లో ఇంటర్‌ (సైన్స్‌) గ్రూప్‌లో పాస్ అవ్వాలి. అలాగే ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం) ఉత్తీర్ణత సాధించాలి. లేదా 2021లో ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న స్టూడెంట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు జనరల్‌, ఓబీసీ విద్యార్థులు 2001, ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఏజ్ లో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక:

నైసర్‌, సీఈబీఎస్‌లో ప్రవేశాలు పొందాలంటే నెస్ట్‌- 2021 పరీక్ష తప్పనిసరిగా రాయాలి. ఇందులో అర్హత సాధించిన వారికి ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్ష విధానం:

ఆన్‌లైన్‌ లో Nest పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు సెషన్లలో ఉంటుంది.

పరీక్షలో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు.

నెగెటివ్‌ (‍Negative) మార్కింగ్‌ విధానం ఉంది.

మొత్తం 150 మార్కుల్లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌ను పర్సంటైల్‌ విధానంలో లెక్కిస్తారు. 4 సెక్షన్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఎక్కువ మార్కులు వచ్చిన 3 సెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటారు. రెండు ఇన్‌స్టిట్యూట్స్ మెరిట్‌ లిస్ట్‌ను వేరువేరుగా తయారు చేసి, అభ్యర్థులను ఎంచుకుంటాయి.

ఎంపికైతే ఏడాదికి రూ.80 వేల స్కాలర్‌షిప్‌

ఈ ప్రఖ్యాత సంస్థల్లో సీటు సంపాదించిన స్టూడెంట్లకు 'దిశ' ప్రోగ్రామ్‌ కింద 5 ఏళ్లపాటు ఏడాదికి రూ.60,000 చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. దీంతో పాటు సమ్మర్‌ ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 అదనంగా ఇస్తారు. ఇవేకాక, ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ కూడా ఉంటుంది. అన్ని సెమిస్టర్లలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రెయినింగ్‌ స్కూల్లో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

ముఖ్యమైన తేదీలు

ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభం

ఏప్రిల్‌ 30 చివరి తేదీగా నిర్ణయించారు.

జూన్‌ 14, 2021న పరీక్ష నిర్వహిస్తారు.

మరిన్ని వివరాలకు https://www.nestexam.in/ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. NEST 2021 Information Brochure & Syllabus

Show Full Article
Print Article
Next Story
More Stories