నేటి నుంచి రెండో విడత కరోనా వ్యాక్సినేషన్

నేటి నుంచి రెండో విడత కరోనా వ్యాక్సినేషన్
x

నేటి నుంచి రెండో విడత కరోనా వ్యాక్సినేషన్

Highlights

దేశ వ్యాప్తంగా నేటి నుంచి రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియా ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో దాదాపు కోటిన్నర మందికి తొలి డోస్,...

దేశ వ్యాప్తంగా నేటి నుంచి రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియా ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో దాదాపు కోటిన్నర మందికి తొలి డోస్, 50 లక్షలకు పైగా మందికి సెకండ్ డోస్ ప్రక్రియ పూర్తయింది. 45 ఏళ్లు దాటిన వారికి, 60 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ వేయనున్నారు. రెండో విడతలో మరోవైపు దీర్ఘకాలిక సమస్యలున్న వారికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు.

తెలంగాణలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. 48 ప్రభుత్వ, 45 ప్రైవేట్ హాస్పిటళ్లలో సోమవారం ఉదయం పదిన్నరకు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ప్రారంభించనున్నారు. ఫస్ట్ డే 93 సెంటర్లలో టీకా వేయనున్నారు. మొదటి రోజు ఒక్కో సెంటర్‌లో రెండొందల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి టీకా వేయనున్నారు.

అటు ఏపీలోనూ కరోనా వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధంమయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90లక్షల మందికి కరోనా టీకా వేయనున్నారు. అందుకోసం ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 60 ఏళ్లు దాటినవారికి, 45-59 మధ్య వయసు వారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారికి నేటి నుంచే టీకా అందించనున్నారు. ఆరోగ్య నెట్‌వర్క్ పరిధిలో ఉన్న 564 ఆస్పత్రులతో కలిపి 2వేల 2వందలకు పైగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

రెండో విడతలో భాగంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో ప్రధాని మోడీ కరోనా మొదటి డోస్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. కోవిడ్ కు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు ఎలా పని చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. టీకాకు అర్హులున్నవారందరూ వేయించుకోవాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories