National Youth Day 2025: స్వామి వివేకానందకు కోతులు జీవిత పాఠాలు నేర్పినప్పుడు..ఇంట్రెస్టింగ్ స్టోరీ

National Youth Day 2025: స్వామి వివేకానందకు కోతులు జీవిత పాఠాలు నేర్పినప్పుడు..ఇంట్రెస్టింగ్ స్టోరీ
x
Highlights

National Youth Day 2025: యువత.. స్వామి వివేకానందను తమ స్ఫూర్తిగా భావిస్తారు. ఆయన బోధనలు నేటికీ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నేడు వివేకానంద...

National Youth Day 2025: యువత.. స్వామి వివేకానందను తమ స్ఫూర్తిగా భావిస్తారు. ఆయన బోధనలు నేటికీ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నేడు వివేకానంద జయంతి. ఈ సందర్భంగా వివేకానందుడు, కోతులకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేడు భారతీయ యువతర వీరుడు స్వామి వివేకానంద జయంతి. ఆధునిక భారత జాతీయవాదానికి పితామహుడిగా స్వామి వివేకానందను పరిగణిస్తారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రంపంచమంతా చాటి చెప్పిన వివేకానందస్వామి 1863 జనవరి 12న కోల్‌కతాలో జన్మించారు. ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రతి ఏడాది జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వివేకానందకు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్. అయితే 1893లో, ఖేత్రి రాష్ట్రానికి చెందిన మహారాజా అజిత్ సింగ్ అభ్యర్థన మేరకు, తన పేరును 'వివేకానంద'గా మార్చుకున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 12న ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు.

1893లో చికాగోలో జరిగిన సర్వమంత సమ్మేళన సభలో స్వామి వివేకానంద చేసిన అనితరసాధ్యమైన ప్రసంగం గుర్తుకు తెచ్చుకుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తాయి. ఈ ప్రసంగం పాశ్చాత్య ప్రపంచానికి హిందూ తత్వశాస్త్రాన్ని (నియో-హిందూత్వం) పరిచయం చేసింది. తన పుస్తకాలలో ప్రాపంచిక సుఖాలు-అనుబంధాల నుండి మోక్షాన్ని పొందటానికి నాలుగు మార్గాలను వివరించారు. అవి రాజయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం.

కోతుల నుంచి జీవిత పాఠాలు :

ఈ కథను స్వామి వివేకానంద స్వయంగా ప్రస్తావించారు. స్వామి వివేకానంద ఒకప్పుడు వారణాసిలో ఉన్నప్పుడు తన చుట్టూ చాలా కోతులు ఉండేవని చెప్పారు. ఈ కోతులకు భయపడి స్వామి వివేకానంద పరుగెత్తారట. ఈ కోతులు కూడా స్వామి వివేకానందను వెంబడించడం ప్రారంభించాయి. పారిపోతున్న వివేకాను ఓ వ్యక్తి కోతులను తరిమికొట్టు అని చెప్పాడట. ఆ వ్యక్తి మాటలు విన్న వివేకానందుడు వెనుదిరిగి కోతులను తరిమికొట్టడం ప్రారంభించారు. ఎట్టకేలకు కోతులు వెనక్కు వెళ్లి పారిపోయాయి. ఈ సంఘటన వివేకానందకు పెద్ద గుణపాఠం నేర్పింది. ఆ తర్వాత వివేకానంద మాట్లాడుతూ జీవితంలో ఎలాంటి ఘోరమైన సందర్భాలైనా ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. కోతుల మాదిరిగా మనం వాటి ముందు పరుగెత్తడం ప్రారంభించినప్పుడు జీవితంలోని కష్టాలు తిరిగి వస్తాయి. మనం ఎప్పుడైనా స్వాతంత్ర్యం పొందాలనుకుంటే, అది ప్రకృతిని జయించడం ద్వారా ఉంటుంది. పారిపోవడం ద్వారా కాదు.. పిరికివాళ్లు ఎప్పుడూ గెలవరు. మనం భయం, ఇబ్బందులు, అజ్ఞానంతో పోరాడాలి. అప్పుడే జీవితంలో విజయాన్ని సాధిస్తామని తెలిపారు.

వివేకానంద చికాగో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..దాని వెనకున్న ఘటన గురించి కూడా వివరించారు. తాను విదేశాలకు వెళ్ళడానికి తన గురువు రామకృష్ణ పరమహంస భార్య శారదామణి ముఖోపాధ్యాయ నుంచి అనుమతి కోరేందుకు వారింటికి వెళ్లారు. ఈ సమయంలో శారదామణి వంటగదిలో ఏదో పని చేస్తోంది. వివేకానంద అనుమతి కోరగా, శారదామణి వివేకానందను అక్కడ ఉన్న కత్తి ఇవ్వు అని చెప్పారట. అప్పుడు వివేకానందుడు కత్తిని మొనపైకి తీసుకుని, కత్తిని శారదామణి వైపు తిప్పాడు. దీంతో శారదామణి సంతోషించి, వివేకానందను చికాగో వెళ్లేందుకు అనుమతిస్తూ, కత్తిని ఇస్తున్నప్పుడు కూడా దాని పదునైన భాగాన్ని చేతితో పట్టుకున్నవు.. మీ మనసు, మాట, చేతల ద్వారా ఎవరికీ హాని చేయరని ఇప్పుడు నాకు అర్థమైందని చెప్పింది. నాకు ఎలాంటి హాని జరగకుండా కత్తి చేతికి ఇచ్చావు అని చెప్పారట. శారదామణి చెప్పిన మాటలే తనను చికాగో వెళ్లేందుకు సహాయపడ్డాయని వివేకానందుడు చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories