కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ, రేపు భారత్ బంద్‌కుపిలుపునిచ్చిన జాతీయ కార్మిక సంఘాలు

National Trade Unions Calls for Bharat Bandh Today and Tomorrow | Live News
x

కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ, రేపు భారత్ బంద్‌కుపిలుపునిచ్చిన జాతీయ కార్మిక సంఘాలు

Highlights

Bharat Bandh: రెండ్రోజుల పాటు బంద్ చేపట్టాలని కార్మిక సంఘాల నిర్ణయం...

Bharat Bandh: జాతీయ కార్మిక సంఘాలు రెండ్రోజుల పాటు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇవాళ రేపు భారత్‌ బంద్ నిర్వహిస్తున్నట్లు జాతీయ కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులను, రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెండ్రోజుల భారత్ బంద్ లో రవాణా కార్మికులు, విద్యుత్ సిబ్బంది కూడా పాల్గొంటారని వెల్లడించింది.

ఇటీవల ఢిల్లీలో వివిధ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులు, ప్రజలు, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని తీర్మానించారు. ఈ బంద్ లో బ్యాంకింగ్, బీమా రంగ సిబ్బంది కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడం, పెట్రో ధరలు మళ్లీ పెంచడం, గ్యాస్ ధరలు భగ్గుమంటుండడం వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories