Narendra Modi: ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోడీ

Narendra Modi resigned as Prime Minister
x

Narendra Modi: ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోడీ

Highlights

Narendra Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాజీనామా లేఖ అందజేత

Narendra Modi: ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ప్రధానమంత్రి రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపధర్మ ప్రధానిగా కొనసాగాలని మోడీని కోరారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు, పవన్, నితీశ్ కుమార్ సహా కూటమి నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటరీ పక్ష నేతను ఈ భేటీలో ఎన్నుకోనున్నారు కూటమి నేతలు. అనంతరం ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories