మోడీ, జిన్‌పింగ్ ఫేస్ టు ఫేస్ భేటీ అయ్యే చాన్స్

మోడీ, జిన్‌పింగ్ ఫేస్ టు ఫేస్ భేటీ అయ్యే చాన్స్
x
Highlights

లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్‌ చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాధినేతలు తొలిసారి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ నెల 10న జరిగే...

లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్‌ చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాధినేతలు తొలిసారి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ నెల 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ వార్షిక సదస్సులో భారత బృందానికి ప్రధాని మోడీ నేతృత్వం వహించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సదస్సులో మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆన్‌లైన్‌ ద్వారా ముఖాముఖీ చర్చలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించే ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధ్యక్షత వహించనున్నారు. చైనా ప్రతినిధుల బృందానికి జిన్‌పింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు.

భారత్, చైనా మధ్య లద్ధాఖ్‌ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దు ఘర్షణలతో గత ఆరునెలలుగా రెండు దేశాల నడుమ ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయమై ఇప్పటికే రెండు దేశాలు పలుమార్లు దౌత్య, సైనిక పరమైన చర్చలు జరిపాయ్. ఐనా పరిష్కారం లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ, జిన్‌పింగ్‌ ముఖాముఖీలో తలపడే అవకాశం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories