West Bengal Election Results 2021: ఐపీఎల్‌ను తలపిస్తోన్న నందిగ్రామ్ వార్

Nandigram Results to go Down the wire Mamata Banerjee
x

సువెందు అధికారి & మమతా బెనర్జీ (ఫైల్ ఇమేజ్)

Highlights

West Bengal Election Results 2021: సీఎం మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య గెలుపు దోబూచులాడుతోంది.

West Bengal Election Results 2021: బిగ్గెస్ట్ బ్యాటిల్‌గా నిలిచిన నందిగ్రామ్‌ సీట్లో ఫలితాల సరళి ఐపీఎల్ మ్యాచ్‌ను తలపిస్తోంది. క్షణక్షణానికి లెక్కలు రౌండు రౌండుకు ఆధిక్యాలు మారుతున్నాయి. నందిగ్రామ్‌ పొలిటికల్‌ వార్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య గెలుపు దోబూచులాడుతోంది.

సువేందు అధికారి బీజేపీలో చేరడం తనకు వెన్నుపోటు పొడిచారంటూ అతనిపై దీదీ పోటీకి దిగడంతో బెంగాల్‌ ఎన్నికల్లో బిగ్గెస్ట్‌ వార్‌గా నిలిచింది నందిగ్రామ్. సువేందును అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వనంటూ తన నియోజకవర్గాన్ని వదిలి మరీ పోటీకి దిగారు దీదీ. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. లెక్కింపు ప్రారంభం నుంచి సువేందు ఆధిక్యంలో కొనసాగడంతో దీదీ పని అయిపోయిందనుకున్నారంతా. నాలుగు రౌండ్ల ఫలితాల్లో ఇదే ట్రెండ్ కనిపించగా ఐదో రౌండ్‌లో లెక్క మారింది. అనూహ్యంగా మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆరో రౌండ్‌లో మళ్లీ సువేందు లీడ్‌లోకి రాగా ఏడో రౌండ్‌లో లీడ్‌ మమత వైపు మళ్లింది. 8వ రౌండ్‌లో సువేందు 9వ రౌండ్లో మమత లీడ్‌లోకి వచ్చారు.

ఓ వైపు బెంగాల్ ప్రజానీకం మొత్తం దీదీకి జై కొడితే నందిగ్రామ్‌లో పరిస్థితులు వేరేలా కనిపిస్తున్నాయి. సువేందు అధికారికి ఉన్న స్థానిక బలం అతని గెలుపునే సూచిస్తోంది. అయితే ప్రస్తుతం ఇద్దరి మధ్య హోరాహోరీ కొనసాగుతుండటంతో చివరికి నందిగ్రామ్ ఎవరి సొంతం అవుతుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories