Top 6 News @ 6 PM: ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం.. బుకింగ్స్​ ఎప్పటినుంచంటే

Top 6 News @ 6 PM: ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం.. బుకింగ్స్​ ఎప్పటినుంచంటే
x
Highlights

Top 6 News @ 6pm: ఇవాళ అక్టోబర్ 22న ప్రపంచం నలుమూలలా జరిగిన ముఖ్యమైన ఘటనలను, వాటికి సంబంధించిన ముఖ్యమైన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

Top 6 News @ 6pm: ఇవాళ అక్టోబర్ 22న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలను, వాటికి సంబంధించిన ముఖ్యమైన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

1) Hyderabad: చందానగర్ యువకుడి మృతి కేసులో కీలక మలుపు

Hyderabad: హైదరాబాద్ చందానగర్ యువకుడి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. యువకుడే బిల్డింగ్ కిటికీలో నుంచి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. కుక్కతో ఆడుకుంటూ... హోటల్ కిటికిలో నుంచి ఉదయ్ అనే యువకుడు పడిపోయాడు. ఈ ఘటన చందానగర్‌లోని వీవీ హోటల్‌లో జరిగింది. స్నేహితుడి బర్త్ డే పార్టీని హోటల్‌లో చేసుకున్న ఉదయ్... మధ్యలో బయటకు వెళ్లాడు. అక్కడే ఉన్న శునకంతో ఆడుకుండూ... అదుపు తప్పి మూడో అంతస్తు నుంచి పడిపోయాడు ఉదయ్. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు... కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2) మరోసారి సంచలనంగా మారిన ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం.. భూములు స్వాధీనం చేసుకుంటామని నోటీసులు

Jeevan Reddy Mall: మరోసారి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం సంచలనంగా మారింది. మాల్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పును తీర్చకుంటే.... తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అధికారులు నోటీసులు ఇచ్చారు. మాల్ నిర్మాణం కోసం ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వద్ద 45 కోట్ల 46 లక్షల 90 రూపాయలను అప్పుగా తీసుకున్నారు.

అప్పును వడ్డీతో సహా చెల్లించకుంటే షూరిటీ ఇచ్చిన వారి భూములను సైతం స్వాధీనం చేసుకుంటాన్నారు. షూరిటీ ఇచ్చిన ఆశన్నగారి రాజన్న, గంగారెడ్డి, నరేందర్, లక్ష్మణ్‌ల భూముల వద్ద సైతం నోటీసులు ఇచ్చారు అధికారులు. జీవన్ మాల్ కు గతంలో ఆర్టీసీకి బకాయి పడ్డ కిరాయి డబ్బులు, విద్యుత్ బిల్లులను చెల్లించాలంటూ.. ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులు వేర్వేరుగా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకనైనా బకాయిలు చెల్లించాలని, లేదంటే షూరిటీ దారుల భూములను స్వాధీనం చేసుకుంటామని మరో మారు సోమవారం స్టేట్ కార్పొరేషన్ ఫైనాన్స్ అధికారులు టీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

3) Free Gas Cylinder: ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం.. బుకింగ్స్​ ఎప్పటినుంచంటే..?

Free gas cylinder scheme in AP: సూపర్ సిక్స్​లో తొలి హామీ అయిన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత సిలెండర్ల పథకాన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లను ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఏడాదికి 2 వేల 684 కోట్ల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలియచేశారు. మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం దీపం పథకం గొప్ప ముందడుగని వ్యాఖ్యానించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేస్తే కోటి నజరానా: పోలీసులకు కర్ణిసేన ఆఫర్

లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు కోటి రూపాయాలను నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణిసేన రివార్డ్ ప్రకటించింది. ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు రాజ్ షెకావత్ ఓ వీడియోను విడుదల చేశారు. బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు 1 కోటి 11 లక్షలు బహుమానంగా ఇస్తామని ఆయన ఆ వీడియోలో చెప్పారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పలు రాష్ట్రాల్లో ఎన్ని హత్యలకు పాల్పడినా కేంద్ర ప్రభుత్వం కానీ, గుజరాత్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తమ అధినేత సుఖ్ దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదని షెకావత్ ఆ వీడియోలో చెప్పారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) హెజ్బొల్లా సీక్రెట్ బంకర్‌లో కట్టలు కట్టల నగదు, బంగారం

Secret Bunker: లెబనాన్ రాజధాని బేరూట్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లకు చెందిన ఓ సీక్రెట్ బంకర్లలో లక్షల కొద్దీ డాలర్ల నగదు, భారీ యెత్తున బంగారం బయటపడిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అల్ సాహెల్ ఆస్పత్రి కింద నిర్మించిన ఈ రహస్య స్థావరంలో హెజ్బొల్లా మిలిటెంట్లు దాచిన డబ్బు బంగారం నిల్వలు భారీయెత్తున ఉన్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ఆయన టీవీలో అధికారిక ప్రకటన చేస్తూ ఇజ్రాయెల్ పై దాడి చేయడానికే మిలిటెంట్లు ఈ నిధులను ఖర్చు చేస్తున్నారని అన్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) అనంతపురంలో భారీ వర్షం.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

Nagarjuna Akkineni: సినీ నటులు అక్కినేని నాగార్జున మంగళవారం వరదలో చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణీస్తున్న కారు వరదలో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మరో దారిలో పుట్టపర్తి నుంచి అనంతపురానికి ఆయనను తీసుకువస్తున్నారు.

అనంతపురంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పండమేరు వాగు ఉప్పొంగింది. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. భారీ వర్షాలకు 44వ నేషనల్ హైవే పై భారీగా వర్షపు నీరు చేరడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు వరద నీటిలో ఇబ్బందులు పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories