Multibagger Stocks: రూ. లక్ష పెట్టుబడిని ఏడాదిలోనే రూ. 71 లక్షలుగా మార్చిన మల్లీబ్యాగర్ స్టాక్.. ఎలాగో తెలుసా?

Simples Papers Multibagger Penny Stocks Full Share Price Details Check Here
x

రూ. లక్ష పెట్టుబడిని ఏడాదిలోనే రూ. 71 లక్షలుగా మార్చిన మల్లీబ్యాగర్ స్టాక్.. ఎలాగో తెలుసా?

Highlights

Multibagger Stocks: రూ. లక్ష పెట్టుబడిని ఏడాదిలోనే రూ. 71 లక్షలుగా మార్చిన మల్లీబ్యాగర్ స్టాక్.. ఎలాగో తెలుసా?

Multibagger Stocks: మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఒక్కాసారి ఈ స్టాక్ గురించి తెలుసుకోండి. పెట్టుబడిదారులకు 7000 శాతం రాబడిని అందించిన స్టాక్‌పై ఓ లుక్ వేయండి.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు శుభవార్త. మీరు కూడా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తుంటే, పెట్టుబడిదారులకు 7000 శాతం రాబడిని అందించిన స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనేక పెన్నీ స్టాక్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. వీటిని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటే మీరు కూడా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు మీకు ఓపికతోపాలు చాలా అనుభవం కావాల్సి ఉంటుంది. నిపుణుల సలహాలతో ఇలాంటి స్టాక్స్‌ను ఎంచుకోవచ్చు.

సింప్లెక్స్ పేపర్ల షేర్లు పెట్టుబడిదార్లకు బోలేడు లాభాలను అందించాయి. ఈ పెన్నీ స్టాక్ ధర రూ.1 నుంచి రూ.71.30కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ పెట్టుబడిదారులకు 7000 శాతం భారీ రాబడిని ఇచ్చింది. షేర్ మార్కెట్ నుంచి డబ్బు సంపాదించడానికి ఇది మంచి ఎంపిక.

సింప్లెక్స్ పేపర్‌ల స్టాక్‌లు గత నెల రోజులుగా అమ్మకానికి గురవుతున్నాయి. గత వారంలో 5 ట్రేడింగ్ సెషన్లలో మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ లోయర్ సర్క్యూట్‌ను తాకింది. గత వారంలో ఈ స్టాక్ దాదాపు 14 శాతం పడిపోయింది. అదే సమయంలో, గత నెలలో, ఈ పెన్నీ స్టాక్ రూ. 122.70 అత్యధిక రికార్డును చేరుకుంది. మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ గత 6 నెలల్లో రూ.4.41 నుంచి రూ.71.30కి పెరిగింది.

ఈ పెన్నీ స్టాక్‌ గత ఒక సంవత్సరంలో రూ. 1 నుంచి రూ. 71.30 వరకు పెరిగాయి. ఈ కాలంలో 7,000 శాతం వృద్ధిని నమోదు చేసింది. 86 లక్షల సింప్లెక్స్ పేపర్‌ల స్టాక్‌లో ఒక వారం క్రితం పెట్టుబడిదారు రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ రూ. 1 లక్ష నేడు రూ. 86 లక్షలు అయ్యేది. ఇది ఒక నెలలో రూ. 1.02 లక్షలుగా మారింది. ఒక ఇన్వెస్టర్ 6 నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ప్రస్తుతం రూ. 16 లక్షలు అయ్యేది.

ఒక పెట్టుబడిదారుడు ఒక సంవత్సరం క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు ఆ రూ. 1 లక్ష విలువ దాదాపు రూ. 71 లక్షలుగా మారేది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడిదారుగా డబ్బును పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణులను సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories