Mulayam Singh Yadav: ఇవాళ ములాయంసింగ్‌ అంత్యక్రియలు

Mulayam Singh Yadav Funeral Today
x

Mulayam Singh Yadav: ఇవాళ ములాయంసింగ్‌ అంత్యక్రియలు

Highlights

Mulayam Singh Yadav: ములాయం అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

Mulayam Singh Yadav: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయంసింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఇటావా జిల్లాలోని ములాయం స్వస్థలం సైఫయ్‌లో ములాయం అంతిమసంస్కారాలు జరగనున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం సింగ్‌.. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ములాయంసింగ్‌ మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక.. ఇవాళ జరగనున్న ములాయంసింగ్‌ అంత్యక్రియలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. మధ్యాహ్నం ములాయం స్వస్థలం సైఫయ్‌కు సీఎం కేసీఆర్‌ చేరుకుంటారు. దివంగత ములాయం సింగ్‌ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి.. నివాళులర్పించనున్నారు. అనంతరం ములాయంసింగ్‌ అంత్యక్రియల్లో పాల్గననున్నారు సీఎం కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories