పాత వాహనాలు ఇక చెత్త లోకే.. ఎందుకో తెలుసా?

Old vehicles will not be permitted on the roads
x

పాత వాహనాలు (పాత చిత్రం)

Highlights

పాత వాహనాలకు రిజిస్ట్రేషన్ ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మీరు 15 ఏళ్లకు మించిన కార్లు బైకులు వాడుతున్నారా ? అయితే ఇది మీకు బ్యాడ్ న్యూసే. పాత బండ్లతో పెరిగిపోతున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది . వచ్చే బడ్జెట్ సమావేశాల్లో స్క్రాప్ పాలసీని ఆమోదించే అవకాశం ఉంది. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు ఇచ్చి కొత్త వాహనం కొంటే రాయితీలు ఇవ్వనుంది.

పాత వాహనాలతో పెరుగుతున్న పొల్యూషన్ ను చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక విధానం తీసుకు రాబోతుంది. 15 ఏళ్ళు దాటినా టూవీలర్లు ట్రక్కులు బస్సులను స్క్రాప్ గా మార్చాలని భావిస్తుంది. లైఫ్ టైం అయిపోయిన వాహనాలను స్క్రాప్ కు అమ్ముకుంటే కొత్త వెహికల్ కొనుగోళ్లకు రాయితీ ఇవ్వనుంది.

పొల్యూషన్ ప్రమాదాలను తగ్గించడం, ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెహికిల్ స్క్రాప్ పాలసీని తీసుకురానుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి గడ్కరీ ఈ విషయంపై ప్రకటన చేశారు. స్క్రాప్ కింద వచ్చే పాత వాహనాల తో ఆటోమొబైల్ సంస్థలు కొత్త వాహనాలను తయారుచేస్తాయి.

2019 లోనే పాత వాహనాలను స్క్రాప్ చేసే విధానాలను కేంద్రం నోటిఫై చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 15 ఏళ్ళు దాటినా వాహనాలకు, రీ రిజిస్ట్రేషన్ చేసుకుని నడిపిస్తున్నారు. ఇలా 30 నుంచి 40 ఏళ్ల వరకు వాహనాలు నడుస్తున్నాయి. కొత్త పాలసీతో పాత వాహనాలకు ఫుల్ స్టాప్ పడనుంది.

ఇప్పటికే హైదరాబాదులో 15 ఏళ్ళు దాటినా వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. దేశంలో లో మొత్తం రెండున్నర కోట్లకు పైగా కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలన్నింటీని స్క్రాప్ కింద వేస్తే ఆటోమొబైల్ కంపెనీలకు స్క్రాప్ సరఫరా పెరగనుంది. పాత ఇనుము తో కంపెనీలు కొత్త బండ్లు తయారీ చేయనున్నాయి

పొల్యూషన్ తగ్గించడానికి ఎలక్ట్రిక్ బండ్లను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో డీజిల్ , పెట్రోల్ ఆదాతోపాటు పర్యావరణాన్ని కాపాడవచ్చు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం రాయితీ ఇస్తుంది. స్క్రాప్ కింద అమ్మే వాహనాలకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇవ్వనుంది. కొత్తగా కొనే వాహనాలకు కొన్ని రకాల టాక్స్ ల నుంచి రాయితీ రానుంది. రోడ్ టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజ్ లో మినహాయింపు ఇచ్చే చాన్స్ ఉంది .

రాష్ట్రంలో కోటి 30 లక్షల వెహికల్స్ ఉన్నాయి. ఇందులో 30 లక్షల వాహనాలు పదిహేనేళ్లు దాటినవి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు .టి ఎస్ ఆర్ టి సి లో 15 ఏళ్లు దాటిన బస్సులో వెయ్యికి పైగా ఉన్నాయి. వెహికిల్ స్క్రాప్ పాలసీ అమల్లోకి వస్తే ఈ బస్సులన్నింటిని స్క్రాప్ కు వేయాల్సి ఉంటుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పాలసీపై ప్రకటన ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories