Tauktae Eeffected Areas: నేడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటన

Modi to Visit Cyclone Tauktae Eeffected Areas
x

Narendra Modi:(File Image)

Highlights

Tauktae Eeffected Areas: గుజరాత్ సహా, డయ్యూలో దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఎరియల్ సర్వే నిర్వహిస్తారు.

Tauktae Eeffected Areas: అరేబియా సముద్రలో తలెత్తి, పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను కకావికలం చేసిన తౌక్టే తుపాను మిగిల్చిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించనున్నారు. గురువారం ఆయన గుజరాత్ సహా, డయ్యూలో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎరియల్ సర్వే నిర్వహిస్తారు. తౌక్తే తుపాను గుజరాత్ వద్ద తీరం దాటడం, ఆ రాష్ట్రలో భారీ నష్టం వాటిల్లడం తెలిసిందే.

తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రేపు ఉదయం 9.30 గంటలకు భావ్ నగర్ చేరుకుంటారు. అక్కడ్నించి ఉనా, డయ్యూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. ఆపై అహ్మదాబాద్ లో తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు.

గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా, తౌక్టే తుపాను గుజరాత్ ను కుదిపేసింది. గత రాత్రి 8.30 గంటలకు తీరం దాటిన తౌక్టే తీవ్ర విధ్వంసం సృష్టించింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు కుదిపేశాయి. తౌక్టే ధాటికి గుజరాత్ లో ఏడుగురు మరణించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్లు, నివాస గృహాలు దెబ్బతిన్నాయి. 16 వేళ్ల ఇళ్లకుపైగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్ గార్డ్ దళాల సహాయక చర్యలతో చాలావరకు ప్రాణనష్టం తగ్గింది. ఉప్పెన వస్తుందన్న హెచ్చరికలతో దాదాపు లక్షమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే.

కరోనా మహమ్మారి రెండో దశ విలయంతో బెంగాల్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడినప్పటి నుంచి ఢిల్లీకే పరిమితమై, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు మూడు వారాల తర్వాత తొలి పర్యటన చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories