Breaking News: ముగిసిన కవిత ఈడీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం..

MLC Kavitha ED Investigation Ended
x

Breaking News: ముగిసిన కవిత ఈడీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం..

Highlights

ముగిసిన కవిత ఈడీ విచారణ

Delhi Liqour Scam: ఉత్కంఠ రేపిన కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్‌గ్రూప్ పాత్రపై కవితను విచారించారు. అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉదయం 11గంటల 9 నిమిషాలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు చేరుకున్న కవిత.. రాత్రి 8 గంటలకు బయటికొచ్చారు.

జాయింట్ డైరెక్టర్ సహా ఐదుగురు సభ్యులతో కూడిన టీమ్ ఎమ్మెల్సీ కవితను విచారించింది. వంద కోట్ల హవాలా డబ్బుపై ప్రశ్నించినట్లు సమాచారం. ఐటీసీ కోహినూర్‌ డీల్ తర్వాత హవాలాలో ఎన్నికోట్లు చేతులు మారాయి..? ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్‌లో హవాలాకు సహకరించింది ఎవరు..? అని కవితను ఈడీ ఆధికారులు ప్రశ్నించారు. అంతకుముందు ధ్వంసం చేసిన ఫోన్ల నుంచి డేటా రికవరీ చేసి.. కవిత ముందు ఉంచింది ఈడీ బృందం విచారణ జరిపినట్లు సమాచారం.

కవిత ప్రస్తుతం వాడుతున్న మొబైల్ ఫోన్‌ను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవిత ఇంట్లో ఉన్న ఫోన్‌ను.. సెక్యూరిటీ ద్వారా బయటికి తీసుకొచ్చారు అధికారులు. అందులో ఉన్న డేటా ఆధారంగా కూడా కవితను ప్రశ్నించారు. ఇక కవిత ఈడీ విచారణ సాగుతున్న క్రమంలో అక్కడి పరిణామాలను హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచే కేసీఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు కేటీఆర్‌, హరీష్‌రావులను అడిగి సమీక్ష జరిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories