ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం స్పష్టం

ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం స్పష్టం
x
Jitendra Singh (File Photo)
Highlights

ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు ఇప్పుడు కరోనా రహితంగా ఉన్నాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డోనర్) రాష్ట్ర...

ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు ఇప్పుడు కరోనా రహితంగా ఉన్నాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డోనర్) రాష్ట్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం వెల్లడించారు. అందులో సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాలు కరోనా ఫ్రీ రాష్ట్రాలుగా ఉన్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన అభినందించారు.

ఇక అస్సాం, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు కరోనా ఫ్రీ కానప్పటికీ తాజాగా కోవిడ్‌ కేసులు అక్కడ నమోదు కాలేదని అయన తెలిపారు. ఈశాన్యంలో తక్కువ కేసులు సంభవించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వానికి చెందినదేనని, గత ఆరేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి భారత ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని జితేంద్ర సింగ్ అన్నారు.

ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల విషయానికి వచ్చేసరికి దేశవ్యాప్తంగా సంఖ్య 28,380కి చేరింది. ఇక ఇప్పటి వరకు 886 మంది మరణించారని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్తగా 488 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది. మొత్తంగా 6,361 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం 21,132 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని హెల్త్‌బులెటిన్‌లో తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories