గ్రామీణ మహిళలకు శుభవార్త అకౌంట్లో డబ్బులు లేకున్న 5 వేలు పొందే అవకాశం.

Ministry of Rural Development providing Rs.5000 overdraft Facility for Rural Women
x

గ్రామీణ మహిళలకు శుభవార్త.. అకౌంట్లో డబ్బులు లేకున్నా 5 వేలు పొందే అవకాశం..(ఫైల్-ఫోటో)

Highlights

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మహిళల అవసరాల కోసం ఉత్తమ నిర్ణయం తీసుకుంది.

Rural Women: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మహిళల అవసరాల కోసం ఉత్తమ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకున్నా ఐదువేలు పొందే అవకాశం కల్పిస్తుంది. దీనినే ఓవర్‌ డ్రాప్ట్ సౌకర్యం అంటారు. దీనివల్ల మహిళలు తన ఖాతాలో ఉన్న డబ్బుకంటే ఎక్కువగా విత్‌ డ్రా చేసుకోవచ్చ. అయితే ఎంత ఎక్కువ తీసుకుంటున్నారో అంత మొత్తం నిర్ణీత కాలంలో చెల్లించాలి. సాధారణంగా కొందరు మహిళలకు అవసరానికి డబ్బు ఉండదు అలాంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఏదైనా బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) ద్వారా పొందవచ్చు. మీరు పొందగలిగే ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి ఎంత అనేది బ్యాంకులు లేదా NBFCలు నిర్ణయిస్తాయి. అంటే వివిధ బ్యాంకులు, NBFCలలో ఈ పరిమితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన స్వయం సహాయక సభ్యులకు ఐదు వేల రూపాయల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అనుమతించడం గురించి 2019-20 బడ్జెట్‌లో ప్రకటన చేశారు.

దీని ప్రకారం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-) NRLM దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఒక అంచనా ప్రకారం DAY-NRLM కింద ఐదు కోట్ల మంది మహిళా స్వయం సహాయక గ్రూపు సభ్యులు ఓవర్ డ్రాప్ట్‌కి అర్హులు అవుతారు. మొదటగా ఈ పథకాన్ని 26 నవంబర్ 2021న అమలు చేయాలని సూచించింది.

కానీ మళ్లీ వాయిదా పడింది. దీనిని అమలు చేయడం కోసం మంత్రిత్వ శాఖ ఇప్పటికే బ్యాంకుల ఉన్నతాధికారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ కూడా ప్రక్రియను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక బృందం సభ్యులు ఈ సదుపాయాన్ని పొందేందుకు కచ్చితంగా జన్ ధన్ ఖాతా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 30, 2021 వరకు బ్యాంకులు 27.38 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.62,848 కోట్ల వరకు రుణాలు అందించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories