Telangana: ఆ నిర్ణయం బాధాకరం- మంత్రి ఈటల

Minister Etela Rajender Press Meet on Corona Situation & Vaccination In Telangana
x

Telangana: ఆ నిర్ణయం బాధాకరం- మంత్రి ఈటల

Highlights

Telangana: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.

Telangana: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆక్సిజన్, వాక్సిన్ల సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా సరఫరా చేస్తూ ఇతర రాష్ట్రాలపై సవితి తల్లిప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఆర్డర్‌ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దీనిపై తాము నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రోజుకు 384 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉందని ఈటల తెలిపారు. ప్రస్తుతం రోజుకు 260-270 టన్నుల ఆక్సిజన్‌ వస్తోందని, ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని చెప్పారు. అక్కడక్కడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆక్సిజన్‌ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories