ఏపీ ప్రభుత్వం తరఫున ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్

ఏపీ ప్రభుత్వం తరఫున ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్
x
Highlights

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తమిళనాడు సీఎం పళనిస్వామి...

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తమిళనాడు సీఎం పళనిస్వామి అధికారులను ఆదేశించారు. ఇక ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎస్పీబి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనిల్.. అనంతరం ఎస్పీ కుమారుడు చరణ్‌ను ఓదార్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తరపున ఘన నివాళి అర్పించామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని..

నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానని చెప్పారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు కూడా ఎస్పీ బాలు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. కాగా.. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ఎస్పీబీ అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గార్డెన్స్‌‌లోనే ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories