Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ లో కొనసాగుతున్న ఉద్యోగాల కోత..మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు

Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ లో కొనసాగుతున్న ఉద్యోగాల కోత..మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు
x

Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ లో కొనసాగుతున్న ఉద్యోగాల కోత..మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు

Highlights

Microsoft Layoffs:ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. మరోసారి ఉద్యోగులకు లేఆఫ్ లు ప్రకటించింది టెక్ దిగ్గజం. ఎంతమందిని తొలగించిందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

Microsoft Layoffs:ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తోన్న పలు టీమ్ లకు చెందిన వారిని తాజా రౌండ్ లో తొలగించినట్లు గ్రీక్ వైర్ అనే మీడియా సంస్థ తెలిపింది. ఎంతమందిని తొలగించిందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. తొలగింపులకు గురైన ఉద్యోగులు లింక్డిన్ వేదికగా పోస్టులు చేస్తున్నారు. దీని బట్టి ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ విభాగాల్లో ఈ తొలగింపులు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

తాజా తొలగింపులపై మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు దీనిపై స్పందించారు. వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తిలో మార్పులు సర్వసాధారమన్నారు. కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలందించడంతోపాటుగా సంస్థ డెవలప్ మెంట్ కు ఆస్కారం ఉన్న విభాగాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు కొనసాగిస్తుందని తెలిపారు. జూన్ 30వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగిసిన కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టడం గమనార్హం.

కాగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపు అనేది ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో గేమింగ్ డివిజన్ లో 2వేల మందిని తొలగించింది. ఇటీవల అజ్యూర్, మిక్స్డ్ రియాల్టీ విభాగానికి చెందిన 1000 మందిని గత నెలలో తొలగించింది. తాజా తొలగింపులు అందుకు అదనం అని చెప్పాలి. గతేడాదిలో మైక్రోసాఫ్ట్ లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.227 లక్షలకు తగ్గింది. మరోవైపు ఈ ఏడాది ఇప్పటివరకు లక్షమంది టెక్ ఉద్యోగులకు పలు టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించినట్లు లేఆఫ్స్. ఎఫ్వైఐ వెబ్ సైట్ డేటా చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories