Congress: మేఘాలయలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. 12 మంది ఎమ్మెల్యేలు

Meghalaya Congress MLAs Joined in Trinamool Congress Party
x

కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Congress: నేడు మేఘాలయకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మనీష్ చత్రత్

Congress: మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది రాత్రికి రాత్రే తృణముల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. వారిలో మాజీ సీఎం ముకుల్ సంగ్మా కూడా ఉన్నారు. తృణమూల్‌లో చేరికపై అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. మొత్తం 60 సీట్లు ఉన్న మేఘాలయ అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

తాజాగా 12 మంది ఎమ్మెల్యేల చేరికతో రాత్రికి రాత్రే తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. దీంతో 2023లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టీఎంసీ బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. వరుసగా మూడోసారి బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న మమతా బెజర్జీ.. ఈశాన్య రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవడంపై దృష్టి సారించారు. అయితే గతకొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై మాజీ సీఎం ముకుల్ సంగ్మా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించిన టీఎంసీ.. వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. వచ్చే ఏడాది గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ బలాన్ని పెంచుకునేందుకు మమత బెనర్జీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు పార్టీ మారారని వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి మనీష్‌ ఛత్రత్‌ ఈ రోజు మేఘాలయ వెళ్లనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories