Char Dham Yatra: చార్‌ ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి కొండల్లో పడిగాపులు..

Massive Rush In Yamunotri
x

Char Dham Yatra: చార్‌ ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి కొండల్లో పడిగాపులు..

Highlights

Char Dham Yatra: చార్‌ ధామ్‌ యాత్రకు భక్తులు పోటెత్తారు. ఉదయం హిల్‌ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది.

Char Dham Yatra: చార్‌ ధామ్‌ యాత్రకు భక్తులు పోటెత్తారు. ఉదయం హిల్‌ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిచ్చాయి. గంటల కొద్దీ జనాలు కొండ ప్రాంతంలో వేచి ఉండాల్సి వచ్చింది. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన యమునోత్రి , గంగోత్రి, కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాలను అక్షయ తృతీయ పర్వదినాన్ని పురష్కరించుకొని తెరిచారు. దీంతో భక్తులు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి పోటెత్తుతున్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజలు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌ ఆలయాలను సందర్శించేందుకు తరలివచ్చారు. దీంతో దర్శనానికి గంటల సమయం పడుతోంది. గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. దీంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకైన దారిలోనే సుమారు రెండు గంటలకు పైగా నిల్చున్నామని, భద్రత, రద్దీ నిర్వహణపై అధికారులు సరైన ఆలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాత్రలో చాలా సమస్యలు ఎదుర్కుంటున్నట్లు వారు వాపోయారు. సాయం చేసేందుకు అధికారులు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించామని, అయితే తిరిగి సజీవంగా వెళ్తామో లేదో అనిపిస్తోందని భక్తులు వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories