Jammu : జమ్మూలోని కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్..5 ఉగ్రవాదులను మట్టుబెట్టిన బలగాలు

Jammu : జమ్మూలోని కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్..5 ఉగ్రవాదులను మట్టుబెట్టిన బలగాలు
x
Highlights

Massive encounter: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను...

Massive encounter: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత భద్రతా బలగాలు ప్రతీకార కాల్పులు జరిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని కాదర్ బిహీబాగ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు ఉగ్రవాదుల డెడ్ బాడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుండి భద్రతా దళాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా, సైన్యం, పోలీసులు మంగళవారం నియంత్రణ రేఖకు సమీపంలోని తంగ్‌ధర్‌లోని అమ్రోహి ప్రాంతంలో సంయుక్త శోధన ఆపరేషన్‌ను ప్రారంభించారు. సెర్చ్ ఆపరేషన్‌లో, నాలుగు పిస్టల్స్, ఆరు మ్యాగజైన్‌లు, సుమారు నాలుగు కిలోల మాదక ద్రవ్యాలు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి అని శ్రీనగర్‌లోని చినార్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ 'ఎక్స్'లో పేర్కొంది.

కాగా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు సమీక్షించనున్నారు. సెప్టెంబరు, అక్టోబరులో కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఈ సమావేశం జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని హోంమంత్రి సమీక్షిస్తారని వర్గాలు తెలిపాయి. కేంద్ర పాలిత ప్రాంతం (UT)లో ప్రస్తుత పరిస్థితి, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి గురించి వారికి సమాచారం ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories