Chhattisgarh: రాకేష్‌ను వదిలిపెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం- మావోయిస్టు కమిటీ

Maoists say Ready for Peace Talks with Govt
x

Chhattisgarh: రాకేష్‌ను వదిలిపెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం- మావోయిస్టు కమిటీ

Highlights

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ ఎటాక్‌పై మావోయిస్టులు అధికారిక ప్రకటన చేశారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ ఎటాక్‌పై మావోయిస్టులు అధికారిక ప్రకటన చేశారు. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ పేరుతో రెండు పేజీల లేఖను విడుదల చేశారు మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్‌. కాల్పుల్లో చనిపోయిన పోలీస్‌ కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని, పోలీసులు తమకు శత్రువులు కాదని లేఖలో పేర్కొన్నారు. 2 వేల మంది పోలీసులు తమపై దాడికి దిగారని, ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు కూడా చనిపోయారని తెలిపారు. దాడిలో 14 ఆయుధాలు, 2వేల తూటాలు, కొంత సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేశారు.

ఎల్‌జీఏను నిర్మూలించేందుకు ప్లాన్‌ చేశారని, విజయ్‌కుమార్‌ నేతృత్వంలో 5 రాష్ట్రాల అధికారులు దాడికి పన్నాగం పన్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రజలు, వనరులు, ప్రజా సంపదను కాపాడేందుకే ప్రతిదాడి చేయాల్సి వస్తోందని లేఖలో స్పష్టం చేశారు మావోయిస్టులు. అలాగే తమ వద్ద బందీగా ఉన్న రాకేష్‌ సింగ్‌ క్షేమంగా ఉన్నాడని, రాకేష్‌ను వదలిపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే బందీని అప్పగిస్తామని స్పష్టం చేశారు మావోయిస్టులు.

Show Full Article
Print Article
Next Story
More Stories