Mansukh Mandaviya: దేశంలో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి

Mansukh Mandaviya About Increasing Of Covid Cases
x

Mansukh Mandaviya: దేశంలో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి 

Highlights

Mansukh Mandaviya: మళ్లీ మాస్కులు తప్పనిసరి చేస్తున్న రాష్ట్రాలు

Corona Virus In India: కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మళ్లీ మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ జాగ్రత్తలు పాటించాలని రాష్ట్రాలు సూచిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సౌకర్యాలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా కేసులు పెరిగేతే అత్యవసర సంసిద్ధతను అంచనా వేయడానికి సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటిచారు. ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లు అమలులో ఉన్నాయని, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి ఫోర్త్ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories