కరోనా కల్లోలం..కూతురికి త‌న ప‌క్క సీటునే పాడేగా మార్చిన తండ్రి

Man Ties Daughters Ddead Body to car Seat as Ambulance Demands Exorbitant Fees
x
తన కూతురు శవాన్ని పక్కన పెట్టుకొని కారు నడుపుతున్న తండ్రి
Highlights

Corona: కూతురి మృతదేహాన్ని త‌న కారులో త‌న ప‌క్క‌సీట్లో పాడెగా మ‌ల‌చి తీసుకెళ్ళిన ఘ‌ట‌న ఒక‌టి వెలుగు చూసింది.

Corona: క‌రోనా ర‌క్క‌సి ఎన్నో కుటుంబాల్లో తీర‌ని విషాదం నింపుతోంది. ఈ మ‌హమ్మారి దాటికి చాలా కుటుంబాల్లో విషాదగీతీక‌లు వినిపిస్తున్నాయి. ఒక చో్ట‌ క‌న్న‌కొడుకు త‌ల్లి ఒడిలోనే ప్రాణాలు వ‌ద‌లిన ఘ‌ట‌న జ‌నం చేత క‌న్నీళ్లు పెట్టించింది. ఈ ఘ‌ట‌న ఇంకా ప్ర‌జ‌లు మ‌ర‌వ‌లేదు. ఇక ఇప్పుడు మ‌రోచోట‌ అలాంటి సందర్భమే ఎదురైంది ఓ తండ్రికి. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు క‌రోనాతో పొరాడి మ‌ర‌ణిస్తే.. క‌న్నీళ్ల‌ను క‌ళ్ళ‌లోనే దాచుకుంటూ.. కూతురి మృతదేహాన్ని త‌న కారులో త‌న ప‌క్క‌సీట్లో పాడెగా మ‌ల‌చి తీసుకెళ్ళిన ఘ‌ట‌న ఒక‌టి వెలుగు చూసింది.

రాజస్థాన్‌లో జల్వార్‌ గ్రామానికి చెందిన సీమకు కరోనా సోకింది. ఆ గ్రామానికి 85 కిలోమీటర్ల దూరంలో ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే దాదాపు నెలరోజుల పాటు కరోనాతో తుదిశ్వాస విడిచింది.కాగా.. కూతురి శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ డ్రైవర్లను సంప్రదిస్తే రూ. 35,000 డిమాండ్ చేశారు. అయితే అంబులెన్సు డ్రైవర్లు అడిగినంత డబ్బు ఇ‍చ్చుకోలేని ఆ తండ్రి, తన కారులోనే కూతురి మృతదేహాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాడు. కూతురు మృత‌దేహాన్ని ఆ సీట్లో కూర్చోబెట్టి, సీట్‌బెల్టుతో గట్టిగా కట్టాడు. 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వ‌గ్రామానికి తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

దీంతో కలెక్టర్‌ వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన రేటు కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కేవలం ఒక రాజస్థాన్ లోనే కాదు అనే రాష్ట్రాల్లో క‌రోనా డెడ్ బాడీల‌ను ఇళ్ల‌కు తీసుకెళ్లాలంటే డ‌బ్బులు భారీగా డిమాండ్ చేస్తున్న ఘ‌ట‌న‌లు వింటున్నాం. క‌రోనా కాలంలో బ్ర‌తికున్న మ‌నిషి విలువ‌ కంటే శ‌వానికే వెల ఎక్కువ అనేలా అనేక ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories