Kolkata Doctor Case: 'నేను సీఎంగా రాలేదు, మీ సోదరిగా వచ్చా...' - నిరసన చేస్తున్న డాక్టర్లతో మమతా బెనర్జీ

Mamata Banerjee accepted the statement of the top officials with the demands of the doctors
x

Mamata Banerjee: వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన బెంగాల్ సర్కార్..కోల్ కతా సీపీపై వేటు

Highlights

Mamata Banerjee: సీఎం మమతతో భేటీ కానున్న జూనియర్‌ డాక్టర్ల బృందం

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతాతో జూనియర్ డాక్టర్ల బృందం భేటీకానుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్‌ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం అనూహ్య పరిణామం జరిగింది.

ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యులతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. ఆమె స్వయంగా నిరసన శిబిరానికి వెళ్లి వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరారు. తాను ఇక్కడికి సీఎంగా రాలేదని, మీ సోదరిగా వచ్చానని చెప్పారు. హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ఎదుట జూనియర్‌ వైద్యులు గత నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories