West Bengal: బెంగాల్ లో మళ్లీ దీదీనే!

Mamata Banerjee to Form Govt in West Bengal Again!
x

West బెంగాల్:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

West Bengal: తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి విజయ తీరాలకు చేరుతుందని ‘టైమ్స్‌ నౌ - సీ ఓటర్‌’ ఒపీనియన్‌ పోల్‌ జోస్యం చెప్పింది.

West Bengal: దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందరి చూపు పశ్చిమ బెంగాల్ వైపే వుంది. కారణం ఎలాగైనా బెంగాల్ లో పాగా వేయాలని బిజెపి తాపత్రయ పడుతుండగా...తనదే మళ్లీ అధికారం అంటూ మమత దీదీ ఘంటా పథంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో మళ్లీ దీదీనే అధికారం చేపట్టబోతున్నట్లు 'టైమ్స్‌ నౌ - సీ ఓటర్‌' ఒపీనియన్‌ పోల్‌ జోస్యం చెప్పింది. దీదీ పార్టీకి భాజపా గట్టి పోటీ ఇచ్చినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లు సాధించబోదని అభిప్రాయపడింది.

ఎన్డీయే అసోంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, పుదుచ్చేరిలో ఘన విజయం సాధిస్తుందని పేర్కొంది. తమిళనాడులో అన్నాడీఎంకే-భాజపా కూటమికి పరాభవాన్ని మిగులుస్తూ, డీఎంకే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని తెలిపింది. కేరళలో వామపక్ష కూటమికి ఈ దఫా సీట్లు కాస్త తగ్గినప్పటికీ, అధికారాన్ని కాపాడుకుంటుందని వెల్లడించింది. 'టైమ్స్‌ నౌ - సీ ఓటర్‌' నిర్వహించిన తాజా ఒపీనియన్‌ పోల్‌ వివరాల ప్రకారం..

పశ్చిమ బెంగాల్‌లో భాజపా దూకుడును తట్టుకొని, తృణమూల్‌ కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ సాధిస్తుంది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. 2016లో రాష్ట్రంలో కేవలం మూడు సీట్లకు పరిమితమైన కమలదళం.. ఈసారి వందకు పైగా స్థానాలను గెల్చుకుంటుంది. అసోంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాజోత్‌ కూటమి, ఎన్డీయే మధ్య హోరాహోరీ పోరు నడవనుంది. ఎన్డీయే స్వల్ప తేడాతో గట్టెక్కి, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి అధికారాన్ని సొంతం చేసుకోనుంది. రాష్ట్రంపై పట్టు బిగించాలన్న భాజపా ఆశ ఈ ఎన్నికల్లో నెరవేరే అవకాశం లేదు. కేరళలో వామపక్ష కూటమి (ఎల్‌డీఎఫ్‌) అధికారాన్ని నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరిగినా.. అధికార పీఠానికి ఆ కూటమి కొద్దిదూరంలో నిలిచిపోనుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు బిజెపి ఆశాభగమనే చెప్పకతప్పదని ఈ సర్వేలు వెల్లడిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories