Mamata Banerjee: వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన బెంగాల్ సర్కార్.. కోల్‌కాతా సీపీపై వేటు

Mamata Banerjee accepted the statement of the top officials with the demands of the doctors
x

Mamata Banerjee: వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన బెంగాల్ సర్కార్..కోల్ కతా సీపీపై వేటు

Highlights

Mamata Banerjee:పశ్చిమ బెంగాల్ కోల్ కతా లో జూనియర్ వైద్యుల ఆందోళన ఓ కొలిక్కి వచ్చింది. నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల డిమాండ్లను నెరవేర్చేందుకు మమతా ప్రభుత్వం అంగీకరించింది.

Mamata Banerjee:పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యుల ఆందోళన దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల డిమాండ్లు నెరేవేర్చేందుకు బెంగాల్ ప్రభుత్వం అంగీకరించింది. నాలుగుసార్లు రద్దు అయిన తర్వాత సోమవారం రాత్రి జూనియర్ డాక్టర్లు సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. దాదాపు 6గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో వైద్యులు ప్రభుత్వం ముందు ఉంచిన 5 డిమాండ్లకు దీదీ సర్కార్ అంగీకరించింది.

ఐదు డిమాండ్లలో మూడింటికి మమతా బెనర్జీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు వారి డిమాండ్లు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైద్యులతో సమావేశం ముగిసిన అనంతరం గంటల వ్యవధిలోనే కోల్ కతా సీపీ వినీత్ గోయల్, వైద్యశాఖకు చెందిన ఇద్దరు అధికారులను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారులను నియమించనున్నట్లు వెల్లడించింది.

ఇక డిమాండ్లకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో వారి ఆందోళనలను విరమించాలని వైద్యులను దీదీ కోరారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకోబోమని వెంటనే విధుల్లో చేరాలని విజ్నప్తి చేశారు. సామాన్య ప్రజలు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories