INDIA Alliance: ముగిసిన ఇండియా కూటమి భేటీ.. ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున్ ఖర్గే ..!

Mallikarjun Kharge As INDIA Alliance PM Face
x

INDIA Alliance: ముగిసిన ఇండియా కూటమి భేటీ.. ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున్ ఖర్గే ..!

Highlights

INDIA Alliance: ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారన్న ఖర్గే

INDIA Alliance: ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ జరిగింది. బెంగాల్ సీఎం మమత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌లు ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు. అయితే ప్రధాని అభ్యర్థి ప్రస్తావన ఇప్పుడే వద్దని ఖర్గే వారిని వారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపీలు నిర్ణయిస్తారని ఖర్గే చెప్పారు. తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. పార్లమెంట్‌లో 141 ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఇండియా కుటమి తీర్మానం చేసింది.

ఈనెల 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీట్ల సర్ధుబాటుపై రాష్ట్రస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న తీర్మాణించారు. రాష్ట్రస్థాయిలో సీట్ల సర్ధుబాటు కుదరకపోతే.. ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఖర్గే తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories