Twitter With New IT Rules: ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్

Making Every Effect to Comply with New IT Rules Says Twitter to Government Last Notice
x

Twitter: (File Image) 

Highlights

Twitter With New IT Rules: భారత చట్టాలకు కట్టబడి ఉంటామని,ఐతే నిబంధనల అమలుకు మరికొంత సమయం కావాలని ట్విట్టర్ కోరింది.

Twitter With New IT Rules: కొత్త ఐటీ నిబంధనల విషయంలో పట్టించుకోని ట్విట్టర్.. కేంద్రం ఫైనల్ వార్నింగ్‌తో ఎట్టకేలకు దిగొచ్చింది. భారత చట్టాలకు కట్టబడి ఉంటామని తెలిపింది. ఐతే నిబంధనల అమలుకు మరికొంత సమయం కావాలని కోరింది. కొత్త నిబంధనల మేరకకు భారత్‌లో గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను ఒప్పంద ప్రాతిపదికన నియమించినట్లు ట్విటర్ ఇండియా పేర్కొంది. అంతేకాదు చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌ను నియమించే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది ట్విటర్. ఫిబ్రవరి 25న ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఫిబ్రవరి 25న నోటిఫై చేసినట్లు గుర్తు చేసింది. ఐతే కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వెంటనే నిబంధనల అమలు ఆలస్యమవుతోందని పేర్కొంది.

కొత్త ఐటీ రూల్స్‌‌పై ట్విటర్ స్పందించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ జూన్ 5న నోటీసులు జారీచేసింది. వెంటనే భారత్‌లో అధికారులను నియమించాలని స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్విటర్ దిగొచ్చింది. కేంద్రం నోటీసులకు సానుకూలంగా స్పందించింది. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేస్తామని తెలిపింది.

ఐతే గడువు ముగిసినప్పటికీ.. ట్విటర్ సహా పలు సామాజిక మాధ్యమాలు మాత్రం కొత్త నిబంధనలను పాటించడం లేదు. నిబంధనల ప్రకారం భారత్‌లో చీఫ్‌ కంప్లియన్స్‌ ఆఫీసర్‌లను నియమించాల్సి ఉంది. కానీ ట్విటర్ ఇప్పటికీ ఆ పనిచేయలేదు. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను కూడా నియమించలేదు. ఈ క్రమంలోనే ట్విటర్ తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు గత వారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు పలువురు ఆర్ఎస్ఎస్ నేతల ట్విటర్ ఖాతాలకు వెరిఫైడ్ బ్యాడ్జ్ (బ్లూ టిక్)ను తొలగించింది. ట్విటర్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories