Maharashtra: డిగ్రీ పూర్తి చేస్తే నెలకు రూ.10వేలు..నిరుద్యోగ యువత కోసం కొత్త స్కీం

Maharashtra governments new scheme for unemployed youth Rs. 10 thousand
x

 Maharashtra: డిగ్రీ పూర్తి చేస్తే నెలకు రూ.10వేలు..నిరుద్యోగ యువత కోసం కొత్త స్కీం

Highlights

Maharashtra:ఎన్నికల సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీం ప్రకటించింది. విద్యార్హతలను బట్టి స్టయిఫండ్ చెల్లించనుంది.

Maharashtra: మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే సర్కార్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత కోసం ఓ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది. సీఎం యువ కార్య ప్రశిక్షణ యోజన పేరుతో నిరుద్యోగ యువతకు వారి విద్యార్హతలను బట్టి నెలనెలా బ్యాంకు అకౌంట్లో స్టయిఫండ్ ను జమ చేయనుంది. దీనికి కోసం రూ. 5,500కోట్లు వెచ్చించనున్నారు. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రకటించడం గమనార్హం.

18 నుంచి 35 ఏళ్ల వయస్సుగల మహారాష్ట్ర నివాసితులు ఈ స్కీమ్ ను అర్హులు. కనీసం 12వ తరగతి పాసై పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఈ స్కీం కింద లబ్ది పొందుతారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందడంతోపాటు పరిశ్రమ అవసరాలకు యువతను సిద్ధం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఆరు నెలల ఇంటర్న్ షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ కానున్నాయి. 12వ తరగతి పాసైన వారికి నెలకు రూ. 6వేలు, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ. 8వేలు, డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారికి రూ. 10వేల చొప్పున స్టయిఫండ్ చెల్లించనున్నారు.

కాగా ఇప్పటికే మహిళలకు లాడ్లీ బెహన్ స్కీమ్ ను ప్రారంభించామని..పురుషుల కోసం పథకాలేవీ లేవా అని ఎంతో మంది అడుగుతున్నారని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. ఈ క్రమంలోనే యువత కోసం ఈ స్కీమును తీసుకువచ్చినట్లు పండరీ పురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షిండే ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్రలో అక్టోబర్ , నవంబర్ మధ్య ఎన్నికలు జరుగుతాయి. 288 స్థానాలున్న మహా అసెంబ్లీకి ఉద్ధవ్ నేత్రుత్వంలోని శివసేన, శరద్ పవార్ నేత్రుత్వంలోని ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేస్తుంటే..ఏక్ నాథ్ షిండే నేత్రుత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేత్రుత్వంలోని ఎన్సీపీ, బీజేపీ ఒక కూటమిగా బరిలోకి దిగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories