Maharashtra: 3 నిమిషాలకు కరోనాతో ఒకరు మృతి.. గంటలో సుమారు 3 వేల మందికి కరోనా

Maharashtra: Every three minute, 1 Person Dies of Covid-19
x

Maharashtra: 3 నిమిషాలకు కరోనాతో ఒకరు మృతి.. గంటలో సుమారు 3 వేల మందికి కరోనా

Highlights

Maharashtra: మహారాష్ట్రలో కరోనా విజృంభణ భయాందోళనలకు గురిచేస్తోంది.

Maharashtra: మహారాష్ట్రలో కరోనా విజృంభణ భయాందోళనలకు గురిచేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఏకంగా 68వేల, 531 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతంగా మారింది. మరోవైపు మృతుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతుంది.

మహారాష్ట్రలో ప్రతి మూడు నిమిషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నారు. మరోవైపు ఒక గంటలో సుమారు మూడు వేల మందికి కరోనా సోకుతుంది. 24 గంటల్లో నమోదైన కరోనా రోగుల సంఖ్య లెక్కల ప్రకారం మహారాష్ట్రలో పరిస్థితి భయానకంగా మారుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్రలో మృత్యుశాతం 1.58గా ఉంది. మరోవైపు 90 శాతానికిపైగా ఉండే రికవరీ రేట్‌ 80.92 శాతానికి పడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories