Maharashtra Elections: ఓటేసిన ప్రముఖులు..

Maharashtra Elections 2024 Celebrities Cast Their Votes
x

Maharashtra Elections: ఓటేసిన ప్రముఖులు..

Highlights

Maharashtra Elections: మహారాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్, యూపీలో ఉప ఎన్నిక జరుగుతోంది.

Maharashtra Elections: మహారాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్, యూపీలో ఉప ఎన్నిక జరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సచిన్ టెండుల్కర్ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అంజలి, కూతురు సారాతో కలిసి ముంబైలో ఓటు వేశారు. ఓటర్లంతా ఓటు వేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సచిన్ విజ్ఞప్తి చేశారు. అలాగే బాలీవుడ్ హీరో అజయ్ కుమార్, సోనూసూద్ ఓటు హక్కును వినియోగించుకుని.. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు.

జాన్ అబ్రహం, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, కబీర్ ఖాన్, రాజ్ కుమార్ రావ్, గౌతమీ కపూర్, అక్షయ్ కుమార్, అలి ఫజల్ తదితరులు ముంబాయి పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు.ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, బాబా సిద్దిఖీ తనయుడు జీషాన్ సిద్ధిఖీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతిలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మహారాష్ట్రలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 288 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4,136 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,00,186 పోలింగ్ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్టు ఈసీ తెలిపింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories