Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. ఆ 2 శాఖలు బీజేపీ చేతికే

Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. ఆ 2 శాఖలు బీజేపీ చేతికే
x
Highlights

Maharashtra Cabinet Expansion News: మహారాష్ట్రలో ఉత్కంఠరేపిన కేబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. 39 మంది కొత్త మంత్రులు ఆదివారం ప్రమాణస్వీకారం...

Maharashtra Cabinet Expansion News: మహారాష్ట్రలో ఉత్కంఠరేపిన కేబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. 39 మంది కొత్త మంత్రులు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలమైన నాగపూర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో 20 మంది ఎమ్మెల్యేలు బీజేపి నుండి గెలిచిన వారు ఉన్నారు. ఇక మహాయుతి కూటమిలో కీలక నేతగా పేరున్న డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ నుండి కేబినెట్‌లో 11 మందికి చోటు దక్కింది. ఇదే మహాయుతి కూటమిలో మరో కీలక భాగస్వామి అయిన అజిత్ పవార్ వర్గంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 9 మందికి మంత్రి పదవి వరించింది.

కీలకమైన మంత్రి పదవుల పంపకాలు ఏలా ఉన్నాయంటే..

కీలకమైన మంత్రి పదవుల కేటాయింపుల్లో బీజేపికి హోంశాఖ, రెవిన్యూ శాఖ దక్కాయి. శివసేన పార్టీ వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ పోర్ట్ పోలియో తీసుకుంది. అజిత్ పవర్ ( Ajit Pawar ) వర్గాన్ని ఆర్థిక శాఖ మంత్రి పదవి వరించింది. ఈ పోర్ట్ ఫోలియోల్లో ఏ శాఖకు ఉండే ప్రాధాన్యత ఆ శాఖకు ఉన్నప్పటికీ.. హోంశాఖ, రెవిన్యూ శాఖలకు మాత్రం ఒకింత ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందంటున్నారు పరిశీలకులు.

మొదట ఈ మంత్రి పదవుల పంపకాల విషయంలో తేడాలు రావడం వల్లే దేవేంద్ర ఫడ్నవీస్‌ను ( Devendra Fadnavis ) ముఖ్యమంత్రిగా ప్రకటించంలో ఆలస్యమైందనే వార్తలొచ్చాయి. ఆ తరువాత మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ కూడా రాజకీయంగా అంతే ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించింది. ఎట్టకేలకు ఏక్‌నాథ్ షిండే ( Eknath Shinde ) నాయకత్వంలోని శివసేన పార్టీని, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేతలకు మంత్రి పదవులు కేటాయించడంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఒక పెద్ద పని అయిపోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories