Maha Janata Curfew: రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట మహా జనతా కర్ఫ్యూ

Maha Janata Curfew In Maharashtra for 15 days
x

మహారాష్ట్ర  సీఎం ఉద్ధవ్‌థాక్రే (ఫొటో ట్విట్టర్)

Highlights

Maha Janata Curfew: మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉండదని స్పష్టం చేశారు సీఎం ఉద్ధవ్‌థాక్రే.

Maha Janata Curfew: మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉండదని స్పష్టం చేశారు సీఎం ఉద్ధవ్‌థాక్రే. రేపు రాత్రి నుంచి మహా జనతా కర్ఫ్యూ ఉంటుందని ఆయన అన్నారు. 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న థాక్రే.. రేపటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాలని సూచించారు. అయితే.. పెట్రోల్‌ బంక్‌లు, మెడికల్ షాపులకు మాత్రం అనుమతినిచ్చింది మహా సర్కార్‌. అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు సీఎం థాక్రే.

ఇక.. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగానే ఉన్నాయని అన్నారు థాక్రే. కేంద్రం నుంచి వ్యాక్సినేషన్‌పై ఎలాంటి సహకారం లేదన్న ఆయన.. ఆస్పత్రుల్లో రోగులకు బెడ్లు, ఆక్సిజన్‌ దొరకని పరిస్థితి ఉందని ఆరోపించారు. రెమ్‌డెసివర్‌ నిల్వలు పూర్తిగా అయిపోయాయని, ప్రధాని చొరవచూపి మహారాష్ట్రకు పంపాలని విజ్ఞప్తి చేశారు థాక్రే.

Show Full Article
Print Article
Next Story
More Stories