గో ముత్రం ఫినాయిలే వాడాలి.. ఎంపీ సర్కార్ సంచలన నిర్ణయం

గో ముత్రం ఫినాయిలే వాడాలి.. ఎంపీ సర్కార్ సంచలన నిర్ణయం
x

 గో ముత్రం ఫినాయిలే వాడాలి

Highlights

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివారజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం మరోసారి వివాదాస్ఫదం అయింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివారజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం మరోసారి వివాదాస్ఫదం అయింది. ఇటీవలే గోమూత్రంతో తయారుచేసిన ఫినాయిల్‌ను ఉపయోగించాలని చౌహాన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గోసంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. గోఉత్పత్తులను కూడా ప్రమోట్ చేస్తున్నాయి. దేశంలోనే తొలిసారి నవంబరులో కౌ క్యాబినెట్‌కు రూపకల్పన చేసిన చౌహన్ సర్కార్.. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను గోమూత్రం ఫినాయిల్‌తో శుభ్రపరచాలని తీర్మానించడం చర్చనీయాంశంగా మారింది.

ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వూల్లో వివిధ మంత్రిత్వశాఖల కార్యాలయాల వరకూ అన్నింటినీ గోమూత్రం ఫినాయిల్‌తో శుభ్రం చేయనున్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ.. గో మూత్రం ప్లాంట్ ఏర్పాటు.. ఫినాయిల్ పరిశ్రమలను స్థాపించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తమ నిర్ణయంతో మధ్యప్రదేశ్ లో ఆవుల సంఖ్య పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆరాష్ట్ర మధ్యప్రదేశ్ మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ తన ఇంటిలో గోమూత్రంతో తయారుచేసిన 'గోనిల్'ను వినియోగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories