Madhya Pradesh Exit Poll 2023: మధ్యప్రదేశ్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. ఈసారి అధికారం ఎవరిదంటే?

Madhya Pradesh Exit Poll Results 2023
x

Madhya Pradesh Exit Poll 2023: మధ్యప్రదేశ్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. ఈసారి అధికారం ఎవరిదంటే?

Highlights

Madhya Pradesh Exit Poll 2023: జన్‌ కీ బాత్‌: బీజేపీ 100-123, కాంగ్రెస్‌ 102-125, ఇతరులు 05

Madhya Pradesh Exit Poll 2023: మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్​మధ్య హోరా హోరీ ఫైట్ నడవనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. మొత్తం 230సీట్లు ఉండగా.. అధికారంలోకి రావాలంటే 116 సీట్లలో గెలవాల్సి ఉంది. సర్వే ఫలితాలను చూస్తే మాత్రం ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేనట్టు కనబడుతోంది. ఇరుపార్టీలు 100 నుంచి 120 స్థానాలు సాధించవచ్చని అంచనా వేస్తున్నాయి సర్వే సంస్థలు.

సీఎన్‌ఎన్‌ న్యూస్ -18 వెల్లడించిన సర్వేలో.. బీజేపీకి 112 సీట్లు, కాంగ్రెస్‌కు 113 సీట్లు రానున్నట్టు అంచనా వేసింది. జన్‌కీ బాత్‌లో బీజేపీకి 100నుంచి 123సీట్లు, కాంగ్రెస్‌కు 102 నుంచి 125 వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ బీజేపీకి 118 నుంచి 130సీట్లు, కాంగ్రెస్‌కు 97 నుంచి 107సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక ఇండియా టూడే బీజేపీ 138 సీట్లు, కాంగ్రెస్ 80సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. సీ-ఓటర్ మాత్రం బీజేపీ 92స్తానాలు, కాంగ్రెస్ 128స్థానాల్లో గెలవనున్నట్టు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. మధ‌్యప్రదేశ్‌లో ఎక్కువ సర్వే సంస్థలు మాత్రం.. బీజేపీకే కాస్త ఎడ్జ్‌ ఉన్నట్టు అంచనా వేశాయి.

మధ్యప్రదేశ్‌ (230): ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు

CNN-18 బీజేపీ 112, కాంగ్రెస్ 113, ఇతరులు 05

జన్‌ కీ బాత్‌: బీజేపీ 100-123, కాంగ్రెస్‌ 102-125, ఇతరులు 05

రిపబ్లిక్‌ : బీజేపీ 118-130, కాంగ్రెస్‌ 97-107, ఇతరులు 0-2

భారత్‌ వర్ష్‌: బీజేపీ 106-116, కాంగ్రెస్‌ 111-121, ఇతరులు 0-6

పీపుల్స్‌ పల్స్‌: బీజేపీ 91-113, కాంగ్రెస్‌ 117-139, ఇతరులు 0-8

Show Full Article
Print Article
Next Story
More Stories