MP Congress MLA Pradyuman Singh Quits Party: కాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యే

MP Congress MLA Pradyuman Singh Quits Party: కాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యే
x
File Photo
Highlights

MP Congress MLA Pradyuman Singh Quits Party: రాజస్థాన్‌లో రాజకీయ గందరగోళం కొనసాగుతోన్న తరుణంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు.

MP Congress MLA Pradyuman Singh Quits Party: రాజస్థాన్‌లో రాజకీయ గందరగోళం కొనసాగుతోన్న తరుణంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఛతర్‌పూర్ జిల్లాలోని బడా మల్హేరా నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రద్యుమాన్ సింగ్ లోధి ఆదివారం పార్టీకి రాజీనామా చేసి, అధికార బిజెపిలో చేరారు. మధ్యప్రదేశ్ లోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి చీఫ్ విడి శర్మ లోధికి పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. బీజేపీలో చేరిన అనంతరం ప్రద్యుమాన్ సింగ్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని.. తన రాజీనామా అంగీకరించబడిందని.. బిజెపి మాత్రమే తన నియోజకవర్గంలోని ప్రాంతాలను అభివృద్ధి చేయగలదని వ్యాఖ్యానించారు.

తన నియోజకవర్గ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు అని.. అందుకే బీజేపీలో చేరానని అన్నారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 91 కి తగ్గింది. ఈ ఏడాది మార్చిలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పార్టీ నుంచి వైదొలిగిన తరువాత కమల్ నాథ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పతనమైంది. మార్చి 23న చౌహాన్ రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపికి ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories