Sabarimala: శబరిమల ఆలయం మూసివేత

Lord Ayyappa Temple in Sabarimala Closed After Mandala Pooja
x

Sabarimala: శబరిమల ఆలయం మూసివేత

Highlights

Sabarimala: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజలు ముగియడంతో అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Sabarimala: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజలు ముగియడంతో అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భారీ సంఖ్యలో భక్తుల సందర్శనతో ఆలయం సందడిగా కనిపించిన ఈ పూజాకాలం ముగిసింది. ఈ నెల 30న తిరిగి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మండల పూజాకాలంలో శబరిమల ఆలయాన్ని దాదాపు 32.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

జనవరి 14న శబరిమల కొండపై భక్తులు మకరజ్యోతిని దర్శించుకోనున్నారు. ఈ ప్రత్యేక ఘట్టానికి దేశవ్యాప్తంగా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. మకరజ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ఇక జనవరి 20న పడిపూజతో శబరిమల యాత్ర ముగియనుంది. ఈ పూజతో కలిసి అయ్యప్ప స్వామి భక్తులు తాము తీసుకున్న దీక్షను ముగించుకుంటారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పూజతో యాత్రకు పూర్తి స్థాయి ముగింపు కలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories