Lok Sabha Speaker: 30 ఏళ్ళలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక.. పోటీలో విపక్ష కూటమి..

Lok Sabha Speaker Election Om Birla vs K Suresh
x

Lok Sabha Speaker: 30 ఏళ్ళలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక.. పోటీలో విపక్ష కూటమి..

Highlights

Lok Sabha Speaker: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Lok Sabha Speaker: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జూలై 3 వరకు జరిగే ఈ సెషన్‌లో రెండో రోజు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల తొలి రోజే 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్‌సభ స్పీకర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గత 30 ఏళ్ళలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్‌ వేయగా.. విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ బరిలో నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories