LokSabha Polls: ఆరో విడత పోలింగ్‌.. ఓటు వేసిన ప్రముఖులు

LokSabha Polls, 6th Phase Polling
x

LokSabha Polls: ఆరో విడత పోలింగ్‌.. ఓటు వేసిన ప్రముఖులు

Highlights

6th Phase Polling: సార్వత్రిక ఎన్నికల్లో ఆరోదశ పోలింగ్ కొనసాగుతోంది.

6th Phase Polling: సార్వత్రిక ఎన్నికల్లో ఆరోదశ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు దశలు పూర్తికాగా.. ఆరో విడతలో భాగంగా.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో -14, పశ్చిమబెంగాల్-8, బిహార్-8, హరియాణా-10, ఒడిశా- 6, జార్ఖండ్-4, ఢిల్లీ- 7, అనంత్‌నాగ్‌-రాజౌరీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈదశలో మొత్తం 889 మంది అభ‌్యర్థులు పోటీపడుతున్నారు.

ఉదయం 9 గంటల వరకు 58 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 10.82 శాతంగా పోలింగ్ నమోదయ్యింది. బిహార్- 9.66 శాతం, హర్యానా -8.31శాతం, జమ్మూ-కాశ్మీర్-8.89 శాతం, జార్ఖండ్-11.74 శాతం, ఢిల్లీ -8.94 శాతం, ఒడిస్సా-7.43, ఉత్తరప్రదేశ్ -12.33, పశ్చిమ బెంగాల్-16.54 శాతం పోలింగ్ నమోదు.

ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ క్యూలైన్‌లో నిల్చుని ఓటు వేశారు.

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తొలి గంటల్లో ఓటేశారు.

తూర్పు దిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌, భాజపా లోక్‌సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్‌, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ కుటుంబం, దిల్లీ మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ, మాజీ సీఈసీ సుశీల్ చంద్ర తదితరులు తొలి గంటల్లో ఓటేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories