Election Commission: మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌

Lok Sabha Election 2024 Poll Schedule To Be Announced Today
x

Election Commission: మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌

Highlights

Election Commission: మధ్యాహ్నం 3గంటలకు మీడియా సమావేశం

Election Commission: నేడు సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు-2024, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానున్నది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ‘జ్ఞాన్‌ భవన్‌’లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ ప్రకటించనున్నది. శుక్రవారం ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి ఒకరు సోషల్‌మీడియా ‘ఎక్స్‌’ వేదికగా అధికారికంగా వెల్లడించారు. లోక్‌సభతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16వ తేదీతో గడువు ముగియనున్నది. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, ఏపీ, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్‌24న ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వెంటనే మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి రానున్నది. కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories